గోరింట నగలు
అందమే ఆనందం

చేతిపై గోరింట పెట్టుకునేందుకు చాల మంది ఆడపిల్లలు ఇష్టపడతారు. అరచేతిలో మాత్రమే గోరింటాకు పెట్టుకోవడం అనేది పాతకాలం ఫ్యాషన్.
ఇంకా చెప్పాలంటే అస్సలు గోరింట అన్న పదాన్నే నేటితరం మర్చిపోయిందన్న ఆశ్చర్యం లేదు.
ఎందుకం టే దానికి బదులుగా ‘మెందిక అనే సంస్కృత పదం నుంచి వచ్చిన ‘మెహందీ పదమే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఆపేరుతో పెళ్లికి ముందు ప్రత్యేకంగా వేడుక చేసుకోవడం, మోచేతుల వరకూ మెహందీ పెట్టించుకోవడం సంప్రదాయంగా మారిపోయింది.
ఆ మెహందీలోనూ బోలెడు డిజైన్లు మొదట్లో కాస్త లావుపాటి అవుట్‌లైన్లతోనూ బోలెడు డిజైన్లు..మొదట్లో కాస్త లావ్ఞపాటి అవ్ఞట్‌లైన్లతోనూ పూలూ కొమ్మలతో సింపుల్‌గా ఉండే అరబిక్ డిజైన్లూ,ఎక్కడ వంపులతో ఉండే సంప్రదాయ మొఘలాయీ డిజైన్లదే హవా.
తర్వాత ఆకులూ లతలూ కొమ్మలతోపాటు నెమళ్ల చిలకలూ వంటి పక్షుల్నీ, గులాబీ తామర పుష్పాల్నీ చొప్పించి, ఎక్కడా న్న ఖాళీ లేకుండా వేసే భారతీయ డిజైన్లే మనవాళ్లకు బాగా నచ్చాయి.
ముఖ్యంగా పెళ్లికోసమైతే అచ్చు గుద్దినట్లుగా పెళ్లి కూతురూ, పెళ్లి కొడుకుల చిత్రాలతోబాటు మొత్తం పెళ్లితంతులోని సన్నివేశాలన్నింటినీ కూడా చేతుల్లోనే చూపించేస్తున్నారు.

ఇప్పుడు వాటి సరసన కొత్తగా ఆభరణాల డిజైన్లనీ చొప్పించి, చేతుల్ని గోరింట ఆభరణాలతో అలంకరిస్తున్నారు.
వేళ్లకి పెట్టుకునే ఉంగరాలూ, వేళ్లకీ మణికట్టుకీ కలిపి పెట్టుకునే మణిబంధనాలూ, బ్రేస్‌లెట్లూ,
గాజూలూ, కాళ్లపట్టీలూ, మెట్టెలూ ఇలా చేతులకీ కాళ్లకి పెట్టుకునే నగల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్నారు.
పాశ్చాత్యదేశాల్లో అయితే చెవిపోగులూ కఫ్‌లతోబాటు మెడలో నెక్లెస్‌ల డిజైన్లను సైతం హెన్నాతో పెట్టించుకునేందుకు సరదాపడుతున్నారట.
నిజానికి ఆభ రణాల రూపంలో మెహందీని పెట్టుకోవ డం అనేది ఈజిప్టు, మొరాకో వంటి దేశాల్లో ప్రాచీన కాలం నుంచీ ఉంది. ఒంటిమీద ధరించే అన్ని రకాల ఆభరణాల డిజైన్లలోనూ అక్కడ మెహందీ పెట్టించు కుంటారు.
వాటిల్లోనూ వేళ్లకీ మణికట్టుకీ కలిపి పెట్టుకునే మణిబంధనాల్లో వచ్చే రకరకాల డిజైన్లయితే అమ్మాయిల చేతుల పైన మరీ అందంగా మెరుస్తున్నా యి.
ఆ డిజైన్ల మరింత అందంగా కనిపిస్తుండటంతో ఆ గోరింట చేతుల్ని వెంటనే ఫొటో ల్లో బంధించేసి ఇన్‌స్టాగ్రాముల్లో పెట్టేయడం ఓ ట్రెండయిపోయింది ఏదయితేనేం..డిజైన్లు మీకూ నచ్చి న ట్రై చేసి చూడండి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/