కాంగ్రెస్ పార్టీ తో టీజేఎస్ పార్టీ పొత్తు..?

తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో పలువురు రాజకీయ నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ తో అయితే బాగుంటుందో నిర్ణయం తీసుకొని అందులోకి వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ హావ రోజు రోజుకు పెరుగుతుంది. అధికార పార్టీ నేతలతో పాటు మిగతా పార్టీల నేతలు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరి బలం ఇస్తున్నారు.

ఈ తరుణంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సైతం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన…. తమ పార్టీకి ఆరు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీజేఎస్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్​ను సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించనున్నారు.