తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ రిజర్వేషన్ ను ప్రారంభించిన రైల్వే

తిరుపతి – సికింద్రాబాద్ ల మధ్య వందే భారత్ ట్రైన్ ను రేపు ప్రధాని మోడీ ప్రారభించబోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ రైల్ 13 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఫస్ట్ డే ప్రత్యేక సమయాల్లో ఈ రైలును నడపనున్నారు. ప్రజా ప్రతినిధు లు , విద్యార్దులు ఈ రైలుకు ప్రతీ స్టేషన్ లో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసారు. ఏప్రిల్ 09 నుండి తిరుపతి నుంచి మధ్నాహ్నం 3.15 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్ చేరుతుంది. 10వ తేదీ నుంచి ఉదయం సికింద్రాబాద్ లో బయల్దేరి తిరుపతి చేరుకుటుంది. తిరిగి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రికి సికింద్రాబాద్ చేరుకొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు. మొత్తం 16 కోచ్ లతో ఈ రైలు సిద్దం అయింది. 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ తిరుపతి చేరుకోనుంది.

ఇదిలా ఉంటె తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ రిజర్వేషన్ ప్రారంభించారు రైల్వే. ట్రైన్ నెంబర్ 20701 ద్వారా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, అదే విధంగా 20702 నెంబర్ ద్వారా తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ టికెట్ ధర రూ 1,680 గా నిర్ధారించారు. అందులో కేటరింగ్ ఫీజు రూ 364 గా ఉంది. వద్దనకుంటే ఆ ఛార్జీ మినహాయిస్తారు. అదే విధంగా ఈ రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ 3,080 గా నిర్ణయించారు. అదే విధంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఛైర్ కార్ ధర రూ 1,625గా ఉంది. అదే రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 3,030 గా ఖరారు చేసారు.

వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్ లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది.