తిరుమలలో భారీ వర్షం ..ఇబ్బంది పడుతున్న భక్తులు

తిరుమలలో భారీ వర్షం కురుస్తుండడం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్వామి వారి దర్శనంకు వెళ్లే భక్తులు, స్వామి వారి దర్శనంతరం వెలుపలకు వచ్చే భక్తులు వసతి గదుల్లోకి వెళ్లేందుకు వీలు పడడం లేదు. అలాగే లడ్డూ వితరణ కేంద్రంలో వర్షపు నీరు నిండి పోవడంతో వర్షపు నీటిని బయటకు పంపేందుకు టీటీడీ పారిశుధ్య కార్మికులు ప్రయత్నిస్తున్నారు.

వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో‌ప్రయాణించే భక్తుల్ని టీటీడీ విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. మొదటి రెండో ఘాట్ రోడ్‌లో వర్షం కారణంగా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని విజిలెన్స్ సిబ్బంది‌ విజ్ఞప్తి చేస్తున్నారు.