భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి
నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం.

న్యూఢిల్లీః న్యూఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం 9.35 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాదరక్షల ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు.. మంటలను అదుపు చేసేందుకు 10 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగినట్టు ఢిలీ అగ్నిమాపక సేవల చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
”పాదరక్షల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. మృతి చెందిన ఇద్దరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్-నార్త్) దేవేశ్ కుమార్ మహ్లా తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/