రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి భవిష్యత్తే లేదు!
ముందు నారయణ కమిటీ నివేదికను తగులబెట్టాల్సింది

అమరావతి: విశాఖపట్టణం మురళీనగర్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపికి, చంద్రబాబునాయుడుకి భవిష్యత్తే లేదని ఆరోపించారు. ఇంకా జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను తగులబెట్టే ముందు చంద్రబాబు నాయుడు నారయణ కమిటీ నివేదికను తగులబెట్టాల్సిందని మంత్రి సూచించారు. ఆ తరువాత మిగతా నివేదికల గురించి ఆలోచిస్తే బాగుండేదని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికీ ఏమీ చేయని చంద్రబాబు తన బినామీ ఆస్తులను మాత్రం పెంచుకున్నారని మంత్రి మండిపడ్డారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రా ప్రజలకు అవంతి శ్రీనివాస్ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ సంక్రాంతి పర్వదినాలను ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకుంటుంటే, చంద్రబాబు మొసలి కీన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/