తిరుమల శ్రీవారి హుండీకి రికార్డ్ ఆదాయం..

tirumala-hundi-collection-ttd-records-over-rs-139-crore-mark-in-july-2022

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డ్ ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్క రోజే రూ.6.30 కోట్లు వచ్చింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు. కరోనా తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. దీంతో హుండీకి భారీగా ఆదాయం వచ్చి చేరుతుంది. నిన్న ఆదివారం ఒక్క రోజే శ్రీవారిని 80,565మంది భక్తులు దర్శించుకోగా.. 31,608మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.6.30 కోట్లు వచ్చింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న రూ.6.18 కోట్లు, 2018లో ఒక రోజు రూ.6.28 కోట్ల రాబడి వచ్చింది. ఇప్పుడు రూ.6.31 కోట్లతో ఆదాయంతో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుతం కొండపై 20 కంపార్ట్‌‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.