తిరుమల ఆలయంలో అనుచరులతో రోజా హంగామా

తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులతో కలిసి వచ్చి టీటీడీ రూల్స్ ను అతిక్రమిస్తున్నారు. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈరోజు రోజా కూడా తన అనుచరులతో వచ్చి నానా హంగామా సృష్టించారు.

వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్‌ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.