సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుపతి: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి అశ్వ వాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/