టిల్లు స్క్వేర్ నుండి ‘టికెటే కొనకుండా’ సాంగ్ ప్రోమో రిలీజ్

సిద్దు – అనుపమ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సీక్వెల్ తాలూకా ఫస్ట్ లుక్ ఆసక్తి రేపగా..సోమవారం సినిమా లోని ‘టికెటే కొనకుండా’ సాంగ్ తాలూకా ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ ప్రోమో లో సిద్దు షూస్‌ క్లీన్ చేస్తూ.. మనసు విరిగినట్టున్నది ఎక్కడ్నో.. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్‌.. అంటూ అనుపమతో అంటున్నట్లు చూపించారు. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ ప్రోమో విడుదలైన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఈ సారి డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉండబోతున్నట్టు ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video