హద్దులు దాటిన పాక్‌..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్మూ కశ్మీర్ లో కాల్పులకు తెగబడిన పాక్

3-Soldiers-Killed-In-Action-In-Pak-Shelling-and-3-Civilians-Dead

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ మరోసారి హద్దులు దాటింది. మోర్టార్లు, ఇతర ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోహ‌ల్‌ స‌హా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక కానిస్టేబుల్‌, న‌లుగురు పౌరులు కూడా ఉన్నారు. ఈ కాల్పుల్లో మ‌రికొంద‌రు జ‌వాన్‌లు, పౌరులు గాయ‌ప‌డ్డారు. వారిని అధికారులు వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పాకిస్థాన్ దాడిని భార‌త్ స‌మ‌ర్థంగా ఢీకొట్టింది. ప‌లుచోట్ల పాకిస్థాన్ బంక‌ర్ల‌ను ధ్వంసం చేసింది. భార‌త సైన్యం ఎదురు దాడిలో సుమారుగా 7 నుంచి 8 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెంది ఉంటారని, మ‌రో 10 నుంచి 12 మంది సైనికులు గాయ‌ప‌డి ఉంటార‌ని ఇండియ‌న్ ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/