దీదీకి గవర్నర్‌ హెచ్చరికలు

నిప్పుతో చెల‌గాటం వ‌ద్దు.. దీదీని హెచ్చ‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

bengal-governor-Jagdeep- Dhankhar

హైదరాబాద్‌: బెంగాల్‌లో బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.అయితే ఆ విష‌యాన్ని ఆ రాష్ట్ర సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ కొట్టిపారేశారు. దీని ప‌ట్ల ఇవాళ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ స్పందించారు. సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు. మేడం, నిప్పుతో చెల‌గాటం ఆడ‌కండి అంటూ ఆయ‌న దీదీకి హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. బెంగాల్‌లో క్షీణిస్తున్న శాంతిభ‌ద్ర‌తల అంశంపై నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ ధ‌న్‌ఖ‌ర్ స‌మ‌ర్పించారు. కోల్‌క‌తాలోని డైమండ్ హార్బ‌ర్ వ‌ద్ద న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుక‌ల‌తో దాడి జ‌రిగింది. ఆ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ అని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. రాష్ట్ర సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల‌ని, చాలా కాలం నుంచి రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/