వందేభారత్ రైలు ఢీకొని ముగ్గురు మృతి

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఏపీలోని విజయనగరం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ట్రైన్ ను మరో ట్రైన్ ఢీ కొట్టటం తో వందలాది మంది గాయపడగా..ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే మీరట్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.

కసం పూర్ వద్ద వందే భారత్ రైలు వస్తున్న క్రమంలో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. ఆ సమయంలో పట్టాలు దాటేందుకు 40 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రయత్నించారు. అదే సమయంలో అత్యంత వేగంగా వచ్చిన వందేభారత్ వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీయూష్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారిని మోనా (40) మనీషా (14), చారు (7)గా గుర్తించారు.