లక్షణాలు కనిపిస్తే తెలియజేయండి… బొత్స

పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నాం

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని నిత్యం సమీక్షీస్తున్నామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆసుత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు పెంచాలని సిఎం ఆదేశించారని అన్నారు.రైతు బజార్ల వద్ద సామాజిక దూరం పాటించాలి అని, సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలను ఇళ్ల వద్దకే వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎవరికయిన కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/