650 కి.మీ నటుడు అజిత్ బైక్‌ రైడింగ్‌

హైదరాబాద్ నుంచి బైక్‌పై చెన్నై వెళ్లిన అజిత్

Ajith takes 650 Kms bike ride
Ajith takes 650 Kms bike ride

చెన్నై: తమిళస్టార్‌ అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ పై మక్కువతో హైదరాబాద్‌ నుండి చెన్నైకి ఒంటరిగా ప్రయాణం చేశారట. సుమారు 650 కిలో మీటర్లు రోడ్డుపై ప్రయాణించి చెన్నై చేరుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణంలో ఆహారం, పెట్రోలు కోసం తప్ప మరెక్కడా ఆగలేదట. ‘వాలిమై’ సినిమా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు. వాటిలో బైక్ చేజింగ్ సన్నివేశం కూడా ఉంది. ఈ సినిమాలో అజిత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ను తయారుచేయించారు. ఈ బైక్‌పై ముచ్చటపడిన అజిత్.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అదే బైక్‌పై చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. దీంతో విమానం టికెట్లు రద్దు చేసుకున్న అజిత్.. బైక్‌పై ఒంటరిగా చెన్నై బయలుదేరాడు. కాగా అజింత్‌ ఎన్నో బైకర్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా కూడా బైక్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/