రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Road Accident
Road Accident

రామన్న పేట: తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం వద్ద కారు అదుపు తప్పి ఎల్లంకి చెరువులోకి దూసుకుపోయింది. కారు పూర్తిగా నీటిలో మునగడంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని సర్నేనిగూడెం సర్పంచ్‌ భర్త మధు, కుమారుడు, వాళ్ల డ్రైవరుగా గుర్తించారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించి కారును చెరులోంచి బయటికి తీశారు. మరోవైపు వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/