స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం గా ఈ నెలలో ఎక్కువ రోజులే స్కూల్స్ కు సెలవులు వచ్చాయి.

రేపు శివ రాత్రి సందర్బంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబు అయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజు కోసం శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9న సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. శుక్రవారం లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటంతో 8న మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.