కాసేపట్లో ఎలివేటెడ్ కారిడార్క్ ను శంకుస్థాపన చేయబోతున్న రేవంత్

మరికాసేపట్లో ఉత్తర తెలంగాణకు రాజమార్గం హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2,232 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్తో నగరంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

11.3 కిలోమీటర్ల పొడవు, ఆరు లైన్లతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే కరీంనగర్, రామగుండం రాజీవ్ రహదారిలో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి రక్షణ భూములపై ఆ శాఖ మంత్రితో చర్చించి ఎలివేటేడ్ కారిడార్ల ఇంపార్టెన్స్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రక్షణ శాఖ భూములను లైన్ క్లియర్ అయింది. మార్చి9 న సికింద్రాబాద్ లో ఎన్‌హెచ్ -44 ఎలివేటేడ్ కారిడార్ కు సైతం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రెండు ఎలివేటేడ్ కారిడార్ల అంచనా వ్యయం రూ.9000 కోట్లు అని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ అభ్యర్థులకు సంబదించిన సమావేశంలో రేవంత్ , ఉత్తమ్ లు పాల్గొనబోతున్నారు.