కాలుష్యంతో ఎముకలకు ముప్పు

ఆరోగ్య పరిరక్షణ

Threat to bones with pollution
Bones Xray

వాయు కాలుష్యం అనేది శ్వాసకోశ వ్యాధులకి మానసిక సమస్యలకీ దారితీస్తుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా ఇది కీళ్లజబ్బులకీ కారణమవుతుందని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వీళ్లు 28 గ్రామాల వాతావరణంలోని కర్చన రేణువుల ఆతాన్ని లెక్కించారట.

ఆ తరువాత ఆయా గ్రామాల్లో నివసిస్తున్న నాలుగువేల మంది స్థానికుల ఎముక సాంద్రతని పరీక్షించారట.

అలా దాదాపు నాలుగు సంవత్సరాలపాటు వాళ్లని పరిశలించిన సమయంలో వాళ్లు పడుతున్న వంటచెరకు కారణంగా క్యూబిక్‌ మీటరుకి 32.8 మైక్రోగ్రాముల కర్చనరేణువ్ఞలు గాల్ల పరచుకుంటున్నట్లు తేలింది.

ఇది ప్రపంచారోగ్యసంస్థ సూచించిన పది మై.గ్రా కన్నా చాలా ఎక్కువ. అంతేకాదు, గాల్లో కార్బన్‌ ఎక్కువగా ఉన్న గ్రామంలోని స్థానికుల్లో ఎముక సాంద్రత తక్కువ ఉన్నట్లూ తేలింది.

బహుశా ఈ కాలుష్యం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, ఎముకలు పెళుసుబారుతున్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వాతావరణ కాలుష్యంతో ఎముక వ్యాధులూ వచ్చే ప్రమాదం ఉందన్నమాట.

రొమ్ము కేన్సర్‌: కొమ్ముకేన్సర్‌ ఎందుకు వస్తుంది. ఎలా వస్తుంది అన్న దానికి ఇప్పటివరకూ సరైన కారణం తెలీదు.

అయితే మొట్టమొదటగా డిఎన్‌ఎలో 350 లోపాలు ఉండటం వల్లే అది వస్తుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు గుర్తించారు.

పైగా అ లోపాలకు 190 జన్యువ్ఞలు కారణమవుతున్నాయట. ఇందుకోసం సదరు పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 450 కేన్సర్‌ సంస్థల ద్వారా లక్షా పదివేల మంది రొమ్ము కేన్సర్‌ బాధితుల జన్యుపటాల్ని విశ్లేషించారట.

చాలావరకూ వ్యాధులన్నీ ఏ ఒక్క జన్యులోపం వల్లో కాకుండా అనేక జన్యులోపాల వల్లే వస్తుంటాయి. రొమ్ముకేన్సర్‌ కూడా ఈ కోవకే చెందుతుంది.

కాబట్టి ఈ సరికొత్త పరిశోధన ఆధారంగా డిఎన్‌ఎ పరీక్ష ద్వారా రొమ్ముకేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించి ఆయా జన్యులోపాల్ని హార్మోన్ల చికిత్స ద్వారా సరిచేయవచ్చని సదరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/