బ్రెడ్‌ చాట్‌

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Bread chaat Making
Bread chaat Making

బ్రెడ్‌చాట్‌

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు- నాలుగు, వెన్న-రెండు చెంచాలు
ఉడికించిన బంగాళాదుంప ముక్కలు- పావ్ఞకప్పు
ఉల్లిపాయ, టొమాటో ముక్కలు- పావుకప్పు చొప్పున
పచ్చివిర్చి- ఒకటి గిలకొట్టిన పెరుగు- అరకప్పు, సన్నని కారప్పూస- పావుకప్పు
గ్రీన్‌చట్నీ, స్వీట్‌చట్నీ- ఒకటిన్నర చెంచా చెప్పున, నల్లఉప్పు- పావు చెంచా, ఉప్పు తగినంత, వేయించిన జీలకర్రపొడి, చాట్‌మసాలా- అరచెంచా, కారం-పావుచెంచా

తయారుచేసే విధానం

బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తొలగించి ముక్కల్లా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి వెన్న, అరచెంచా ట్‌మసాలా వేయాలి. ఇందులో బ్రెడ్‌ముక్కల్ని వేసి కరకరలాడేలా వేయించుకుని తీసుకోవాలి. వీటిపైన నల్ల ఉప్పు, కారం, జీలకర్రపొడి, మిగిలిన చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలూ వేసి కలపాలి. వడ్డించే ముందు పెరుగు, గ్రీన్‌, స్వీట్‌ చట్నీలు, సన్నకారప్పూస వేస్తే చాలు. బ్రెడ్‌ముక్కలు కరకరలాడేలా ఉంటేనే చాట్‌ రుచిగా ఉంటుంది.

చిల్లీ చట్నీ పనీర్‌చాట్‌

కావలసినవి: అంగుళం సైజులో తరిగిన పనీరు ముక్కలు- రెండు కప్పులు,
పచ్చిమిర్చి- పది
వేయించిన నువ్ఞ్వలు- అరకప్పు, బెల్లం- అరకప్పు, చింతపండుగుజ్జు-రెండు పెద్ద చెంచాలు
కారం-చెంచా ఉప్పు తగినంత
నూనె- పావుకప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌- ఒక్కోటి చొప్పున,
నిమ్మరసం- రెండు పెద్ద చెచాలు, ఎండుపుదీనా ఆకులు- రెండు చెంచాలు,
వేయించిన జీలకర్రపొడి- పావ్ఞచెంచా, కొత్తిమీర-పావుకప్పు
పసుపు- పావుచెంచా

తయారుచేసే విధానం:

ముందుగా స్టౌమీద నాన్‌స్టిక్‌ పాన్‌ని పెట్టాలి. అది వేడయ్యాక పనీర్‌ ముక్కల్ని వేసుకుని, నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్‌, ఉల్లిపాయ వేయించుకోవాలి. ఓ గిన్నెలో నువ్వులపొడి, చింతపండు గుజ్జు, బెల్లం తీసుకుని స్టౌమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక కారం, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇది ఉడికి గ్రేవీలా తయారయ్యాక వేయించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలతోపాటు మిగిలిన పదార్థాలూ వేసుకుని రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

న్యూడుల్స్‌ చాట్‌

న్యూడుల్స్‌ ప్యాకెట్‌ం ఒకటి, మొక్కజొన్నపిండి, మైదా రెండు టేబుల్‌స్పూన్లు చొప్పున. ఉప్పుం తగినంత, నూనె- వేయించేందుకు సరిపడా, క్యాబేజీ తరుగు- అరకప్పు
క్యారెట్‌తురుము- పావ్ఞకప్పు, ఉల్లాపాయలు- రెండు, క్యాప్సికం, టొమాటో- ఒకటి చొప్పున, పచ్చిమిర్చి-మూడు, చిల్లీసాస, సోయాసాస్‌, స్వీట్‌చట్నీ

తయారుచేసే విధానం

నూడుల్స్‌ ఉడికించుకుని నీళ్లు వంపేసి కొద్దిగా నెయ్యివేసి కలిపితే ఒకదానికి మరొకటి అత్కుకోవ్ఞ. తరువాత వీటిపై మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఈ నూడుల్స్‌ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెనలో సన్నకార ప్పూస, పల్లీలు తప్ప మగిలిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కొటిగా వేసుకు ని అన్నింటినీ బాగా కలపాలి. తినేముందు నూడు ల్స్‌పైన ఈ మిశ్రమం, వేయించిన పల్లీలు, సన్నకారప్పూస వేసుకుంటే చాలు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/