సూపర్‌ఫుడ్స్‌ తింటున్నారా!

ఆహారం ఆరోగ్యం

Super food


చలికాలంలో రోగనిరోధకశక్తి పెంచుకోడంతోపాటు చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. అందులో కొన్ని జాగ్రత్తలివి..

సజ్జ : బి విటమిన్లు అధికంగా ఉంటాయి. కండరాల పరిమాణం పెరుగుతుంది. వెంట్రుకలు పెరిగేందుకు సాయ పడుతుంది.

ఎలా తినాలి:

చపాతీ, లడ్డూ, కిచిడీ, అట్టు.. ఇలా ఏ విధంగా తిన్నా ఫలితం ఉంటుంది. వేరు జాతి కూరగాయలు: ఇవి ప్రి బయాటక్‌.. బరువు తగ్గడంలో. జీర్ణక్రియ సవ్యంగా జరగడంలో తోడ్ప డతాయి. అలానే పోషకాల శోషణను పెంచుతాయి.
ఎలా తినాలి: టిక్కీ, కూర, ఫ్రై చేసుకొని తినొచ్చు.

నువ్వులు : వీటిలో అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌ ఇ ఎక్కువ.
కురులు, చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎలా తినాలి: చిక్కీ, లడ్డూ, చట్నీగా నువ్వులను తీసుకోవాలి.

వేరు సెనగలు : విటమిన్‌ బి.అమినో నువ్వులను తీసుకోవాలి. విటమిన్‌ బి, అమినో ఆమ్లాలు, పాలీ ఫినాల్స్‌ ఉంటాయి. ఇవి గుండెను భద్రంగా ఉంచుతాయి.
ఎలా తినాలి: ఉడికించి లేదా వేగించి తినొచ్చు. చుట్నీగా, సలాడ్‌ లేదా కూరల్లో వేసుకొని తిన్నా ఓకె.

నెయ్యి : విటమిన్‌ డి శోషణలో ఉపయోగపడుతుంది.ఆహారానికి రుచిని తెస్తుంది.
ఎలా తినాలి: పప్పు, అన్నం, చపాతీతో తీసుకోవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/