ఏనుగు బొమ్మలు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

New Model sarees
New Model sarees

హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం ఏనుగు. అలా వీధుల్లో పోతుంటే ఆ నడకలో ఎంత రాజసం, ఎంత గాంభీర్యం. ఏనుగును అదృష్టచిహ్నంగా భావిస్తారు.

వినాయకుడి ప్రతినిధిగా కొలుస్తారు. ఏనుగు ఫ్యాషన్‌ ప్రపంచంలో కూడా, కాస్త ఆలస్యంగా మందగమనంతోనే అడుగు పెట్టింది.

ఏనాడో పట్టు చీరలకు జరీ అంచుగా మారి ఇప్పుడు టాప్స్‌, చెరింగులు, తలగడలు, నెక్లెస్‌లు, జడక్లిప్పులు, దుపట్టాలు, హ్యాండ్‌ బ్యాగులు-ఇలా ప్రతీచోట ఫ్యాషన్‌ డిజైన్‌లా మారిపోయారు.

Hand bags

మొన్నటి వరకు చిలకలు,నెమళ్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో సందడి శాయి. ఇప్పుడు హస్తిగారి హస్తవాసి కూడా బాగానే కలిసొస్తోంది.

యువత ఏనుగు ఫ్యాషన్‌ను పిచ్చిపిచ్చిగా ఫాలో అయిపోతున్నారు. కాలేజీకెళ్లే అమ్మాయి తెల్లటి షాల్‌పై నల్లటి ఏనుగుల డిజైన్‌ను ఏరికోరి ఎంచుకుంటోంది.

తొండ మెత్తిన ఏనుగు చక్కని చక్క మణికట్టుపై మెరిసే చెక్కరాజుపై అందంగా రంగులద్దు కుంది. నఖశిఖం నాజూగ్గా కనిపించే మెట్రో సుందరి గోళ్ల కాన్వాసుపై పెయింటింగ్‌లానూ మారింది.

అంతేనా, చెవిపోగులకు వేలాడుతూ కూడా దర్శనమిస్తోంది. ఫ్యాషన్‌ పుస్తకంలో ఏనుగుకి ఓ ప్రత్యేకమైన పేజీ ఉందిప్పుడు…

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/