ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిసిన బీఆర్ఎస్ ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్

జనసేన పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్..శుక్రవారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్ కూడా పాల్గొన్నారు. తోట చంద్ర‌శేఖ‌ర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా సీఎం కేసీఆర్ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప‌టిష్ట‌త కోసం ప‌లు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ రెండు, మూడుసార్లు స‌మావేశ‌మై తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు.

ఇదిలా ఉంటె సీఎం కేసీఆర్‌ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నారు. ఈ భేటీలో గిరిధర్‌ కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.