నిరుపేదలకు ప్రభుత్వ సాయం అందేలా చూడండి

తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలకు అందించే ప్రభుత్వ సాయం వారికి అందేలా చూడాలని తెలంగాణ పశు సంవర్ధక శాక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. వలస కార్మికులు మరింతగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వారిపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని అన్నారు. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డు లేని వారి జాబితాను సిద్దంచేయాలని సూచించారు. అలాగే నగర పరిదిలో ఆహర పంపిణీ కార్యక్రమం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే చేపట్టాలని అన్నారు. రోడ్లపై ఉండే యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ఫంక్షన్‌ హల్స్‌, ప్రభుత్వ పాఠశాలను షెల్టర్‌లుగా ఉపయోగించాలని అన్నారు. షెల్టర్‌కు తరలించిన వారందరికి జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించాలనన్నారు. అంతేకాకుండా వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/