మెగాస్టార్ చెయ్యి పట్టుకున్న మాస్ రాజా

మాస్ రాజా రవితేజ..మెగాస్టార్ చెయ్యి పట్టుకున్నారు. అదేంటి అనుకుంటున్నారా..అయితే ఫుల్ స్టోరీ చదవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో బాబీ సినిమా ఒకటి. చిరు 154 మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని మాస్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అప్పుడెప్పుడో అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన రవితేజ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. రవితేజ ఈ మూవీ లో నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి మంచి క్రేజ్ ఏర్పడింది. శనివారం రవితేజ షూటింగ్​లో జాయిన్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ అప్డేట్​ను ఆందిస్తూ.. ఆసక్తికర పోస్టర్​ను విడుదల చేసారు. అంతేకాదు.. రవితేజను మెగాస్టార్​ తన కారవాన్​లోకి లాగేసినట్లు ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. సినిమా పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక వారం రోజులు వరకు చిరంజీవి రవితేజకు సంబంధించిన సన్నివేశాలను కంటిన్యూగా షూట్ చేయబోతున్నారట. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

YouTube video