ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ

అమరావతి: ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సమావేశంలో దిల్‌ రాజు, అలంకార్‌ ప్రసాద్‌.. ఇతర నిర్మాతలు పాల్గొన్నారు. భేటీలో సినీ రంగానికి సంబంధించిన సమస్యలు, ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై దిల్‌రాజు స్పందిస్తూ.. ‘ప్రభుత్వం మా నుంచి కొంత సమాచారం అడిగింది. ఆ సమాచారం ఇవ్వడానికే మంత్రిని కలిశాము’ అని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/