చరణ్ కూతురికి ఏ పేరు పెట్టారంటే..

రామ్ చరణ్ దంపతులు జూన్ 20 న పండంటి ఆడపిల్ల కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు మెగా వారసురాలు కు బారసాల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉయ్యాలలో వేసి నామకరణం చేసారు. తన మనవరాలి పేరును సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తెలిపారు. పాప పేరు క్లీంకార కొణిదెల అని వెల్లడించారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని చిరంజీవి వివరించారు. పేరులోని లక్షణాలను తమ చిన్నారి ఎదిగేకొద్దీ తన వ్యక్తిత్వంలో కచ్చితంగా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు.

మొత్తానికి రామ్ చరణ్ ఉపాసన హిందూ విశ్వాసాలని ఎంత బలంగా నమ్ముతారో ఈ పేరుతోనే స్పష్టం అయిపోతుంది. కాస్తా ఇంగ్లీష్ సౌండ్ వినిపిస్తోన్న అచ్చమైన సంస్కృతి భాష నుంచి పేరుని తీసుకొని కుమార్తెకి పెట్టడం నిజంగా గొప్ప విషయం. మరి ఈ పేరుకి తగ్గట్లుగానే ప్రకృతి శక్తిని తనలో ఇముడ్చుకొని గొప్పగా ఎదగాలని సినీ ప్రముఖులు అందరూ రామ్ చరణ్ ఉపాసన దంపతులకి విషెస్ చెప్పడంతో పాటు బేబీకి పేరుని కూడా ట్రెండ్ చేస్తున్నారు.