400 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించనున్న సిఎం
నోయిడాలో 144 సెక్షన్

లక్నో: యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు నోయిడా సెక్టార్ 39లో గల జిల్లా ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. ఈ కోవిడ్ ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ యూనిట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. నిపుణులైన వైద్యులను నియమించారు. ఈ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 400 పడకలు సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, ఐదవ అంతస్తులో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. అలాగే రెండవ అంతస్తులో డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలోనే పోలీస్ అధికారులు నోయిడాలో 144సెక్షన్ విధించారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటనకు ముందు 15గెజిటెడ్ అధికారులు, విధుల్లో ఉన్న 700 మంది కానిస్టేబుళ్లు కొవిడ్19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని అదనపు నోయినా ఏడీసీపీ రణవిజయ్ సింగ్ తెలిపారు. యూపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య నోయిడా సెక్టార్ 39లో సీఎం కొవిడ్ దవాఖానను ప్రారంభించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/