అన్ని రంగాలకు ఊతం ఇచ్చే బడ్జెట్‌

ఈ బడ్జెట్‌తో వ్యవసాయ రంగం పురోగతి

kanna laxminarayana
kanna laxminarayana

అమరావతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్పందనలు వస్తున్నాయి. సహజంగానే విపక్షాలు బడ్జెట్ పై పెదవి విరుస్తుండగా, బిజెపి నేతలు మాత్రం ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా, ఏపీ బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ తో వ్యవసాయరంగం వేగంగా పురోగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరడం తథ్యమని జోస్యం చెప్పారు. సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి… ఇలా అన్ని రంగాలకు ఊతమిచ్చే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/