ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం

శ్రీకాకుళం: సింగూరు ఇసుక రీచ్ వద్ద అక్రమ ఇసుక రవాణాలో పాల్గొన్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎస్పిఎఫ్ ఎన్వీ సురేంద్ర బాబు ప్రకటించారు. శనివారం ఉదయం సురేంద్ర బాబు మాట్లాడుతూ… రాత్రి సమయాల్లో శ్రీకాకుళం జిల్లా సింగూరు ఇసుక రీచ్ వద్ద అక్రమ ఇసుక రవాణాను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సంబంధిత వ్యక్తులు, వాహనాలపై కఠిన చర్యలు తీసుకోడానికి ఉపక్రమిస్తోందన్నారు. దీనిపై పోలీస్ కేసు ఫైల్ చేసి అక్రమ ఇసుక రవాణాలో ఉన్న లారీలు, వ్యక్తులపై చట్ట ప్రకారం తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసిందన్నారు. రెండు సంవత్సరములు జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలుకి సిద్ధమయ్యిందని ప్రకటించారు. దీని వెనుక ఎంతటి బలమైన వ్యక్తులు ఉన్నప్పటికీ వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాలో పాల్గొన్న వాహనాలను సీజ్ చేసి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తెలుసుకుంటామని వివరించారు.
తాజా బడ్జెట్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/budget/