నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Palnadu district : నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లా ప్రధాన కేంద్రమైన నరసరావుపేటలో ఫ్లెక్సీల విషయంపై బుధవారం రాత్రి వివాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం … పల్నాడు రోడ్ లో గల ఒక ప్రైవేట్ హాస్పటల్ పైన గురువారం నరసరావుపేటకు ముఖ్యమంత్రి జగన్ విచ్చేస్తున్న క్రమంలో వైసీపీకి చెందిన ఒక నాయకుడికి చెందిన ప్లెక్సీని ప్రైవేట్ హాస్పటల్ కు చెందిన వైద్యునితో అనుమతి తీసుకొని ప్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే తెదేపాకు చెందిన నాయకులు ఆ ప్లెక్సీని హాస్పటల్ బిల్డింగ్ నుండి తొలగించడంతో వైకాపా నాయకులు ధర్నాకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్లెక్సీలు తొలగించిన వారిపై పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/