ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉంది
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశాం

న్యూఢిల్లీ: ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లు రెండూ వేర్వేరు అంశాలు అని, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను యూటీగా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే బీమాను రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదించడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా ఆయన ప్రశంసించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/