ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

YouTube video
1st Meeting of Seventh Session of XV Legislative Assembly on 18-11-2021 LIVE

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్‌ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.

ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/