వైసీపీ గెలిచే సీట్లు ఇవే – RRR జోస్యం

ఏపీలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగనుండటంతో ఈ ఫలితాలను జూన్ 04న విడుదల చేయనున్నారు. దీంతో ఈ ఫలితాలపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు కోట్లలో పందేలు కాస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే సీట్లు ఇవే అంటూ రఘురామ కృష్ణంరాజు జోస్యం తెలిపారు.

వైసీపీకి 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు అన్నారు. జూన్ 4వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.