అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..?

వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎమ్మెల్యే పిన్నెల్లి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి నిజంగా వీరు హైదరాబాద్ కే వెళ్ళారా..? మరెక్కడికైనా వెళ్ళారా..? అనేది తెలియాల్సి ఉంది.