లాభపడిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్693.. నిఫ్టి 191

ముంబయి: దేశంలో కరోనా భయంతో పతనమవుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు కోలకున్నాయి. ట్రేడింగ్ మొదలయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లిన సూచీలు కేంద్రం ఉద్దిపనలను ప్రకటిస్తుందనే అంచనాలతో లాభాల బాట పట్టాయి. నేడు ట్రేడింగ ముగిసే సమయానికి సెన్సెక్స్ 693 పాయింట్లు లాభపడి 26,674కు చేరింది. నిఫ్టి 191 పాయింట్లు లాభపడి 7801 వద్ద ముగిసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/