నటి శోభన ఇంట్లో దొంగతనం

సీనియర్ నటి శోభన ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నై తేనాంపేట శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి శోభన నివసిస్తున్నారు. ఆమె ఇంట్లో కడలూర్‌ జిల్లా కాట్టుమన్నార్‌ కోవిల్‌కు చెందిన విజయ అనే మహిళను ఏడాదిగా పని చేస్తుంది. గత కొద్దీ రోజులుగా ఇంట్లో డబ్బులు మాయం అవుతూ ఉన్నాయి. అయితే అవేమైనా ఖర్చు చేసి ఉంటానేమో అని శోభన అనుకుంది. కానీ పదే పదే డబ్బులు మాయం అవుతుండడం తో ఆమెకు పనిమనిషి విజయ ఫై అనుమానం వచ్చింది.

దీంతో తేనాంపేట పోలీసు స్టేషనులో పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విజయను అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరపగా గత మార్చి నుంచి జూన్‌ వరకు రూ.41 వేలు చోరీ చేసినట్లు తెలిపింది. పేదరికం కారణంగా చోరీకి పాల్పడినట్లు విజయ ఒప్పుకొని శోభన వద్ద మన్నించమని ప్రాధేయపడటంతో ఆమె పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకొని ఇంట్లోనే పనిచేయడానికి అనుమతించింది. మళ్లీ విజయ తప్పుచేయదనే నమ్మకం తో శోభన ఆమెను పనిలో పెట్టుకుంది. మరి విజయ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా..అనేది చూడాలి.