సినీనటులకు రాజధాని రైతు ఆందోళన సెగ

‘మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు’ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన

Actors Chiranjeevi, Nagarjuna at Gannavaram Airport


అమరావతి: అమరావతి రాజధాని రైతుల ఆందోళన సెగ సినీనటులకు తాకింది.. ఇవాళ సిఎంతో సినీనటులు భేటీ కానున్న విషయం విదితమే.

కాగా చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి సురేష్‌బాబు గన్నవరం విమానాశ్రయం చేరుకుని రోడ్డుమార్గుంద్వారా ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు అతిథి గృహానికి వచ్చారు.

సినీనటుల బృందం బస చేస్తున్న గెస్ట్‌హౌస్‌ ఎదుట రాజధానిమహిళా రైతులు ఆందోళనకు దిగారు..

మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

అప్రమత్తమైన పోలీసులు ముందుగా గెస్ట్‌హౌస్‌ ప్రాంతానికి చేరుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/