వైఎస్‌ఆర్‌సిపి అన్ని చోట్లా విజయం సాధిస్తుంది

రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదు

avanthi srinivas rao
avanthi srinivas rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్‌ఆర్‌సిపి పాలనకు రెఫరండం కాదని అన్నారు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడులా పూటకోమాట తమ ప్రభుత్వం చెప్పదని ఆయన స్పష్టం చేశారు. రాజధానుల అంశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని తాము భావించడం లేదని అన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటారని అవంతి శ్రీనివాస్‌ రైతులకు భరోసా ఇచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/