ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న విజయమ్మ

ఈరోజు బాలినేని ఇంట్లో అల్పాహారం

Vijayamma on a tour of Prakasam district

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆమె ఒంగోలులోని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. బాలినేని కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. నిన్న ఆమె వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించారు. విజయమ్మ రాకతో ఒంగోలులో సందడి నెలకొంది. మరోవైపు బాలినేని, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలు వైఎస్ కుటుంబానికి బంధువులు అనే విషయం తెలిసిందే.