కోబి బ్రయాన మృతి అత్యంత విషాదం: ట్రంప్‌

విచారం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్

Kobe Bryant-trump
Kobe Bryant-trump

వాషింగ్టన్‌: లాస్ ఏంజిల్స్ శివారులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోబి బ్రయాన, ఆయన 13 ఏళ్ల కూతురు గియానా సహా 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే కోబ్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్ బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రయాన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్న ట్రంప్, ఈ దుర్ఘటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని అన్నారు. బ్రయాన మృతిపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ‘బ్రయాన, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/