రజనీకాంత్‌ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాడింగ్‌

Rajinikanth
Rajinikanth

చెన్నై: ఈ రోజు ఉదయం చెన్నై నుంచి మైసూరు బయలుదేరిన ట్రూజెట్ విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలెట్ విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు తెలియజేయడంతో అత్యవసరంగా విమానం దిగేందుకు అనుమతిచ్చారు. ఇదే విమానంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సహా 48 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్యను సరిచేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందన్న విషయాన్ని విచారిస్తున్నామని ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/