ఐక్యపోరాటాలు కరవైన దళిత ఉద్యమాలు

దళితుల భవిష్యత్తు అగమ్యగోచరం

Dalit movements - File
Dalit movements – File

గత నలభై సంవత్సరాలుగా దళితులలో (ఎస్సీ, ఎస్టీ) మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దళితులలో వచ్చిన మేలుకొలుపు వారి ఎదుగుదలకు కాకుండ రాజకీయ పార్టీలకు ఊడిగం చేసే రీతిలో ఉంది.

సాధారణంగా ఏ ఉద్యమం అయినా తలపెట్టినవారి బాగోగులకు ఉపయోగపడాలి!

కానీ 1995లో వ చ్చిన దళితుల్లోని మాల-మాదిగ డివిజన్‌ కావాలని ఉన్నత వర్గా లు వీరిని తప్పుదోవ పట్టించాయి. రాజకీయ పార్టీలు ఆ విభజ నను పెంచి పోషించాయి.

దాంతో దళితుల్లో ఐక్య ఉద్య మం ఐక్య పోరాటాలు కరువైనాయి. దళితుల భవిష్యత్తు అగమ్యగోచరంగామారింది.

మాల మహానాడు మాదిగ పోరాట సమితులుగా విడిపోయి ఎదగాలనుకుంటే వాటిని అగ్ర వర్ణాల వారు మరింత అణచివేశారు.

అయినా వీరు స్థానిక సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లుగా రూపాంతరం చెంది ఎవరి బాటలో వారు పయని స్తున్నారు.

మార్స్కిజమ్‌ ఎన్నో శాఖలుగా విభజించబడి విస్తరించి పలు విధాలుగా ఎదిగేందుకు ఉపయోగపడింది. ఈ దళితుల ఉద్యమా లు ఎదుగటం వల్ల కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతిన్నాయి. యుపి లో దళిత మహిళా సిఎంగా మాయావతి ఎన్నికయ్యారు.

అగ్ర కులాలు పన్నిన వలలో పడి అధికారానికి దూరమయింది బిఎస్‌పి. ఈ స్థితిలో దేశ వ్యాప్తంగా దళితులు బలహీనమై శక్తిని కోల్పోయారు.

అదే ధోరణిలో దళితులు కమ్యూనిస్టు జెండాలు మోయకుండా స్వయంగా పార్టీలు పెట్టిన వారికి మద్దతునిస్తూ వస్తున్నారు.

దాంతో కమ్యూనిస్టులు పోరాట పటిమను కోల్పో యారు. దళితులలో పెరిగిన అవగాహన, రాజకీయ బానిసత్వం వైపు మొగ్గు చూపకుండా స్వతంత్రంగా వ్యవహరించసాగారు. కానీ దళితుల్లో ఐక్యత కరువైంది. దాంతో దళిత ఉప-కుల సంఘాలు ప్రాంతీయ పార్టీలకు మద్దతుదార్లుగా మారారు.

కానీ దళితుల ఎదుగుదలకు అభివృద్ధికి తోడ్పడడం లేదు. కారణం రాజకీయ పార్టీలు దళిత నాయకులను గుప్పిట్లో ఉంచుకొని మద ్దతును పొందుతున్నాయి.

రాజ్యాంగ కల్పించినట్లు జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు 82 ఎస్టీలకు 47 ఎం.పి. సీట్లు, రాష్ట్రాలలో 400 ఎం.ఎల్‌.ఏ. సీట్లు రిజర్వు చేయబడ్డాయి.

కానీ దళిత రిజ ర్వు సీట్లలో ఎన్నికైన దళిత ప్రతినిధులు దళిత ప్రజానీకానికి జవాబుదారిగా వహించడం లేదు. ఏమని అడిగితే నేను దళితుల ఓట్ల వలననే గెలవలేదు,

అందరు ఓట్లు వేస్తే గెలిచానని తప్పిం చుకుంటున్నారు. దళితులు పొందిన ఓటు హక్కుకు పదును కరవైంది.

అంతేగాక ఎన్నికల సమయంలో దళితులకు తాగుడు పోస్తే ఎంతో వినయంగా, నమ్మకంగ తాగుడు పోయించిన అభ్యర్థికి ఓటు వేయడం జరుగుతుంది.

అందుకే అంబేద్కర్‌”నా జనులకు కత్తులు, కటారులు, ఆయుధాలు, బాంబులు సమ కూర్చలేదు. వారు లీడర్లు అయ్యేందకు ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఆయుధాన్ని కల్పించాను.

ఆ ఓటుహక్కును ఉపయోగించుకొని పాలకులు అవుతారనుకున్నాను. కానీ ఆ ఓటుహక్కును అమ్ము కొని బతుకుతెరువు, తాగుడు వ్యసనానికి తాకట్టు పెట్టేస్తున్నారు.

దళిత విద్యావంతులు చదువుకొని దళితుల్లో చైతన్యం నింపు తారని డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశించాడు.

ఇటీవల అమెరికాలో నల్ల జాతీయులు జార్జిపాయిడ్‌పై తెల్లజాతి పోలీసు దాష్టికంతో మెడ మీద తొక్కి తొమ్మిది నిమిషాలు ఉంచి,నాకు ఊపిరాడడం లేదని చెప్పినా వినకపోవడంతో అతడు చనిపోయాడు.

దాంతో తెల్ల జాతీయుల మీద నల్ల జాతీయులు చూపిన వివక్ష తకు అందరు మూకుమ్మడిగా నిరసనలు తెలుపుతూ బయటికి వచ్చారు.

అదే స్థితి ఇండియాలో ఎందుకు రాలేదంటే పై కారణాలు చెప్ప వచ్చు. అమెరికాలో నల్ల జాతీయులు ఎందుకు ఐక్యంగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడగలుగుతున్నారంటే కారణం ”నల్ల జాతి అంతా ఒకటే వారి మతం ఒకటే క్రైస్తవ్యం.

నల్ల జాతీ యులు 1961 నుండి పెద్ద నిరసన ఉద్యమం చెలరేగింది. అంటే నల్ల జాతీయులు అనుభవిస్తున్న జాతివివక్షతను వెళ్లగక్కేందుకు ఊకుమ్మడిగా, కలిసికట్టుగా తెల్లజాతి అహంకారాన్ని వ్యతిరేకిం చటానికి ముందుకు వచ్చారు.

బారక్‌ ఒబామా డెమో క్రాట్‌ అధ్యక్షుడుగా రెండు సార్లు గెలిచి అధ్యక్ష పదవిని పొందాడు. రిపబ్లికన్‌ పార్టీ అంతా శ్వేత జాతీయులు అధికం

ట్రంప్‌ అందుకే వారి నిరసనను లెక్కచేయకుండా బంకర్‌లో దాక్కుని నిరసనను తట్టుకున్నాడు.

దీన్ని జాతి వివక్షతగా గుర్తించి ఐక్యరాజ్యసమితి వ్యతిరేకించింది. నెల్సన్‌ మండేలా, దక్షిణాఫ్రికాలో శాంతి యుతంగా పోరాడి అధికారం చేజిక్కించుకున్నారు.

బిజెపి 2016-2019 ఎన్నికలు 66-38 ఎస్టీ సీట్లు బిజెపి గెలుచుకొని సంఖ్యా బలంగా వాడుకొంటోంది.

కానీ దళితులకు సముచిత స్థానం యివ్వలేదు. దళితుల్లో ఉత్తేజం పెరగాలి. దళితుల అభ్యు న్నతికి కృషి చేసేవారిని దళితులు ఎన్నుకోవాలి.

అంతవరకు దళితులు మన్ను తిన్న పాముల్లా పడి ఉండాల్సిందే! అధికారానికి దాసోహం అంటూనే ఉంటారు.

  • డాక్టర్‌. కె.ఆసయ్య

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/