ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

స్వీయ జాగ్రత్తలే మేలు: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో సుమారు ఏడువేల మంది మరణ వార్త మరువకముందే రాష్ట్రనడిబొడ్డు ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో పసిపిల్లలు, గర్భిణీలు వందలాది మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వరదల అనం తరం, మురుగునీరు తొలగించక, మురుగు కాల్వల్లో తాగునీటి పైపులకుబెజ్జాలుఏర్పడి తద్వారామురుగునీరు సేవన, ఈగలు, దోమలు,కుక్కలు, పందులు విపరీతంగా సంచరించడం, పారి శుధ్య నిర్వహణ లేమివంటి పలు కారణాలతో పీల్చేగాలి, తాగేనీరు విషతుల్యం అవ్ఞతున్నాయి. పేటల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, వ్యాధిపై అవగాహన కల్పించి వైద్యసిబ్బంది జాగు రూకతతో వ్యవహరించాలి.

సామాన్యునికి సమన్యాయం: -డా.దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి

కుటుంబమైనా, గ్రామమైనా, రాష్ట్రమైనా,దేశమైనా ఐక్యం, గోప్యం లేకపోతే అవి కుక్కలు చింపిన విస్తరాకులు కావడం ఖాయం.స్వార్థం,అసూయ,అధికారకాంక్షలు ఉన్నవారు అనుకు న్నవి జరగకపోతే ఎంతటి ఉన్మాద చర్యలకైనా! బరితెగించడం చరిత్రలో చూస్తున్నాం.వాస్తవాలకళ్లకుగంతలు కడుతున్నన్నాళ్లు అపోహలకంటకాలు అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూనే ఉంటా యి.దెయ్యాలు వేదాలు వల్లిస్తూనే ఉంటాయి. అబద్దాలు నిజా లుగా చెలామణి అవ్ఞతూనే ఉంటాయి. ఎదురుగా నందిని పెట్టి పదిమందిచేత గుడ్డిగా అది పంది అనిపిస్తే పందిలాగే చెలామణికాగా వాస్తవాల పిల్లగాలులు విషతుఫానులుగా మారి నిజాయితీపరులు విస్తుపోయివిజ్ఞత కోల్పోవలసివస్తుంది.నమ్మ లేనినిజాలు కళ్లముందు కనుమరగవ్ఞతూనే ఉన్నాయి.

భూ సర్వే మంచి ప్రయత్నం: – శ్రీనివాస్‌గౌడ్‌ ముద్దం,హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వేప్రారంభం కానున్నది. దీని కోసం రాష్ట్రప్రభుత్వం రూ.988కోట్లు ఖర్చు చేయనుంది. కేంద్రప్రభుత్వం కూడా తమవంతు సాయంగా ఇప్పటికే రూ.200 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళనకోసం భూములరీసర్వే ప్రక్రియను చేపట్ట బోతున్నారు.గతంలో భూ భారతి పేరిట రీసర్వే మొదలు పెట్టినా అది సఫలంకాలేదు.ప్రస్తుతంసర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,466 గ్రామాల్లో రెండు కోట్ల 26 లక్షల ఎకరాల స్థలాన్ని సర్వే పరిధిలోకి తీసుకొచ్చారు.

వ్యవసాయ మార్కెట్లో లోపాలు: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో లోపాలు ఉంటే సంస్కరించి ఉండాల్సింది. కానీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయకుండా బాధ్యతల నుంచి వైదొలిగింది. కార్పొ రేట్‌ చేతుల్లోకి వెళ్లేలా చట్టాలు రూపొందించింది. రైతుల అను మానాలన్నీఇక్కడే మొదలయ్యాయి.కార్పొరేట్‌లో రైతుకు మెరు గైన రేటు దొరుకుతుందన్న గ్యారెంటీ ఎక్కడా కనిపించడం లేదు. రైతుల లాభం కోసమే ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి ఉంటే రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలతో ఇప్పటికే విస్తృతంగా చర్చించి ఉండాల్సింది. అది జరగలేదు. పైగా కేంద్రప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే అనేక అంశాల్లో ఎన్నో అనుమానాలున్నాయి. దాని ఫలితమే ఇంతటి పెద్ద ఉద్యమం. రైతులకు నమ్మకం కలిగేలా ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే తప్ప ఈ గండం నుంచి బయటపడడం అంత తేలిక కాదు.

బెంబేలెత్తిస్తున్న పులులు: – జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల జిల్లా

కొమురంబీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇటీవలి కాలంలో ఇద్దరు గిరిజన వ్యక్తులను పులులు చంపిన ఘటనలు ప్రజలను బెంబే లెత్తిస్తున్నాయి. చంపినపులి, తిరిగి చేలో పనిచేస్తున్న బాలికను మట్టుబెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దశాబ్దాలుగా పులుల సంచారం ఉంది. తెలంగాణలో అత్యధిక అటవీ శాతం ఉన్న జిల్లాఖమ్మం అయినా పులుల సంచారం మాత్రం ప్రస్తుత నిర్మల్‌, ఆసిఫాబాద్‌,మంచిర్యాల జిల్లాల్లోనే ఎక్కువ. ఇక గోదా వరికి దిగువ పులులు ప్రవేశించడం లేదు.అటువైపు మహారాష్ట్ర నుండి పై జిల్లాల్లో ప్రవేశిస్తున్నాయి. మనిషి మాంసానికి అలవాటుపడిన పెద్దపులి పదేపదే మానవ సంహారానికే ప్రయత్నిస్తుంది. అటవీశాఖ అధికారులు మాటు వేసి అలాంటి ప్రమాదకర పులులను బంధించాలి.

మానవ హక్కులపై అవగాహన ఉండాలి: -పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడంతో తృప్తిపడ కుండా మానవీయ విలువల గురించి మానవత్వం గురించి విస్తృతంగాచేయాలి.నగర నలుమూలాల్లోనే కాకుండా మం డలపరిధిలో కూడా అవగాహనసదస్సులు ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు మానవ హక్కుల గురించి హృదయాలకు హత్తుకునేలా బోధించాలి. నేటిపిల్లలురేపటి పౌరులు కనుక వారే సమాజంలో కీలక పాత్ర వహిస్తారు. హత్యలు, మానభంగాలకు చరమగీతం పాడాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/