విశాఖలో రాజధాని కాదు.. మరో ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలి

Steel Factory (File)

డబ్బుల్లేనప్పుడు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి, కాపునేస్తం మొదలైనవి అమలు చేయడం ఎందుకు? మూడు రాజధానులు ప్రకటించడం ఎందుకు? ఎంతసేపు సంక్షేమమే కాదు, అభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి. వైఎస్సార్సీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నవరత్నాలతోపాటు అభివృద్ధి కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిమిత్తం అంతర్జాతీయ రోడ్లకు, భవనాలను కట్టడానికి రూ.10వేల కోట్లు రమారమి ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అక్టోబర్‌ 22వ తేదీ 2015వ సంవత్సరంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోడీ చే శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రోజున ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నోవేల కోట్లు నిధులు మంజూరు చేస్తారని అనుకుంటూ నవ్యాంధ్ర ప్రజలు ఎదురు చూశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలను ప్రధాని మోడీ చిదిమేసి ఏమీ ప్రకటించలేదు.

అప్పుడు ప్రధాని ఆ రోజున మట్టీ, నీళ్లు మాత్రమే తీసుకొచ్చారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని వదిలివేసి విశాఖకు తీసుకుని వెళ్లడం ప్రధానిని అవమానపర్చడమే అవ్ఞతుంది. విశాఖనగరం ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్వం నుంచి ప్రథమస్థానంలో ఉంది. దేశంలోనే తొమ్మిదవ స్థానమో పదవోస్థానమో ఆక్రమించింది. 1970లోనే అప్పటి ఆర్థిక శాస్త్రవేత్తలు, నిపుణులు, మేధావి వర్గం, భారతదేశంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టడానికి విశాఖనగరమే చాలా అనువైనదని, సముద్ర రవాణా మార్గం కూడా ఉందని అప్పటి రాజనీతి కోవిదులు అంద రూ చెప్పారు.

ఆ సమయంలోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందుస్తుగా 1971లోనే పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటించి ఎన్నికల ప్రచార నిమిత్తం విశాఖనగరం వచ్చి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, ఈ ఫ్యాక్టరీలో 1977 నాటికి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవ్ఞతుందని ప్రకటించారు. తర్వాత దేశంలో కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల తన పదవి కాపాడుకోవడానికి జూన్‌ 25 అర్థరాత్రి 1975లో ఎమర్జెన్సీని ప్రకటించి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

మరుసటి రోజు పార్లమెంట్‌లో ఆమోదింపచేసిశారు. అప్పటి పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రిగా తెలుగువారు అయిన కాసు బ్రహ్మానందరెడ్డి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ముందుగా పార్లమెంట్‌లో ఆమోదించకుండా మీరు ఎలా ఆర్డినెన్స్‌ జారీ చేసారని అడిగారు. దాంతో వారిద్దరికీ వైషమ్యాలు వచ్చి కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీలింది. కాంగ్రెస్‌ పార్టీ ఆవ్ఞదూడ గుర్తు బ్రహ్మానందరెడ్డికి వచ్చినది. ఇందిరాగాంధీకి హస్తం గుర్తు వచ్చింది.

తర్వాత మరలా ఎమర్జెన్సీ తీసివేశారు. 1977లో ఫిబ్రవరి, మార్చిలో పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటించారు. అప్పుడు కూడా ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచార నిమిత్తం 1977 మార్చి మొదటి వారంలో విశాఖ నగరం వచ్చి మీ ఎన్నికల వాగ్దానం ఇంకా మర్చిపోలేదు. ఉక్కు ఫ్యాక్టరీ త్వరలో పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఉత్తరభారతదేశంలో ప్రజలందరూ ఇందిరాగాంధీని కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా ఓడించి జనతా ప్రభుత్వానికి పట్టం కట్టారు.

అప్పటి ప్రధాని మొరార్జీదేశా§్‌ు విశాఖ నగరంలో ఉక్కుఫ్యాక్టరీ కట్టి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి విశాఖలో పరిపాలనా రాజధాని కాకుండా మరో ఉక్కు ఫ్యాక్టరీ కట్టి యువతకు ఉపాధి కల్పిస్తే చాలా బావ్ఞం టుంది. అలాగనే పాలక ప్రభుత్వం దిశ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మద్దతు పలికారు. అలాగనే ముఖ్యమంత్రి, అతని మంత్రివర్గం కూడా ప్రతిపక్షనేత సూచనలు, సలహాలను మంచివి ఉంటే తీసుకుని పాలకులు, ప్రతిపక్షనేత రాష్ట్రాభివృద్ధికి ఇరువ్ఞరు పాటుపడాలి.

కేంద్ర ప్రభుత్వంపై అధికారపక్షం ప్రతిపక్షం కూడా కలిసి ప్రత్యేకహోదా కోసం ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తేరాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. గతంలోనే ప్రధాని ఇందిరాగాంధీ, ఇప్పటి ప్రధానిమోడీ కూడా ఆంధ్రప్రదేశ్‌ గురించి ఏవిధమైన అభివృద్ధికి సహకారం అందించలేదు.

ఇప్పటి ప్రధాని ఎన్నికల ప్రచార నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి వచ్చారు కానీ ఏమీ ప్రకటించలేదు. కావ్ఞన పాలక పక్షం, ప్రతిపక్షం ఏకమై రాష్ట్రాభివృద్ధికి పాటుపడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలి. కావ్ఞన విశాఖ నగరంలో మరో ఉక్కు ఫ్యాక్టరీ కట్టడమే చాలా మంచిది.

  • అడబాల మరిడియ్య

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/