పాక్‌కు అమెరికా ప్రభుత్వం సహాయం

100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చిన అమెరికా

US donates 100 ventilators to Pakistan

ఇస్లామాబాద్‌: అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్‌ పోరాటంలో పాకిస్థాన్‌కు సహాయం చేసింది. దాదాపు 3 మిలియన్ డాలర్ల విలువైన 100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడి) ద్వారా అమెరికాలో తయారైన వెంటిలేటర్లను డొనేట్‌ చేసింది. కరాచీ చేరుకున్న వీటిని దేశంలోని వివిధ ఆస్పత్రులకు పంపించనున్నారు. కోవిడ్‌19 నేపథ్యంలో అంతర్జాతీయ అభివృద్ది సంస్థ ద్వారా పాక్‌కు వెంటిలేటర్లు అందజేశామని పాక్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనాపై పోరాటంలో భారత్‌కు సహాయపడటానికి అమెరికా దాదాపు 1.2 మిలియన్ డాలర్ల విలువైన 100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా అందించిన విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/