జనాలను ముంచిన జడివాన!

రికార్డు స్థాయిలో వర్షపాతం: పొంగిన వాగులు, వంకలు

Heavy Rain
Heavy Rain

రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్నిజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి జిల్లాలు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ కరీంనగర్‌జిల్లాల పరిధిలోని అన్ని జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షాలు పడుతున్నాయి. చ

ాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి. చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు ఇసిరిఇసిరి కొడుతున్నాయి. ఎన్నడూలేని విధంగా వర్షాలతో కారుచీకట్లు కమ్ముకున్నాయి.

వర్షబీభత్సంతో జనావాసాలు చిందరవందరగా మారి ఈదురుగాలులతో, బతుకు జీవుడా అని గజగజ వణుకుతూ బతుకుమీద ఆశతో నిద్రలేని రాత్రి గడిపినప్పటికీ నిర్విరామంగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రధాన రహదారులు జలదిగ్భందం అయి, యావత్‌ రాష్ట్ర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్‌ చేసి జాగ్రత్తలు తీసు కున్నప్పటికీ, వర్షబీభత్సాన్ని తట్టుకోవడం జనజీవనానికి ఇబ్బం దిగా మారింది.

ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి అప్రమత్తం చేయడం మూలానా భారీ నష్టం జరగలేదు.

అనుకోని పిడుగు పాటుకు ప్రభుత్వానికి నిద్రలేకుండా చేసింది.ఇలాంటి ప్రమాదం ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభం నుండి ప్రతి నెలలో వర్షాలు కురిసి నష్టం చేస్తూనే ఉంది.

గత ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. సెప్టెంబరు మాసంలో వరంగల్‌ జిల్లాలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇప్పుడు మాత్రం రాష్ట్రం అంతా తాజాగా అన్ని జిల్లాలో 10 సెంటీమీటర్ల నుండి 32 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిందని మరో రెండు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటిం చడంతో ప్రభుత్వం సహాయకచర్యలు ముమ్మరంచేసింది.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌, విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూర్‌ రహదారులపై రాకపోకలు స్తంభించాయి.

అన్ని పట్టణాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ప్రభుత్వం ఎన్టీఆర్‌ఎఫ్‌, జిహెచ్‌ ఎంసి ఆధ్వర్యంలో పనిచేసే రిజిస్ట్రార్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ బృందాలతో పాటు రాష్ట్ర పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లోకి దిగింది.

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, సిబ్బందితోపాటు ప్రతి డివిజన్‌లో సేవలందించేం దుకు రాత్రికి, రాత్రి ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేసి పార్టీ శ్రేణులకు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకుపిలుపు ఇవ్వడం జరిగింది.

గత మూడు నెలల నుండి ప్రతి నెలలో కుంభవృష్టి కారణంగా నీళ్లు, నిలిచి, నాని పాత భవనాలు కూలి, కొంత ప్రాణనష్టం చవిచూడాల్సి వచ్చింది.

మంగళవారం రాత్రి ప్రారంభమైన వరద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రోడ్డు మీద భారీ ఎత్తున నీరు నిలిచి ఉండటం, కాలనీలలోకి కూడా నీరు పెద్దఎత్తున చేరడంతో చాలా మంది ప్రజలు ఇళ్లలోనే చిక్కుకు పోయారు.

వరద భయంతో కొందరు బిల్డింగ్లపైకెక్కి సహాయం కోసం ఎదురు చూసిన సంగతి విధితమే. వ

రద తీవ్రతను, వారికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ఉధృతి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట, ఆరాం ఘర్‌ నడుమ ఉన్న అనేక లోతట్టు ప్రాంతాలలో,కాలనీలలో ఆస్తినష్టం తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా పాత భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వేల సంఖ్యలో ఉన్న బాధితులకు సహాయం అ దించడానికి,ప్రభుత్వంతోపాటు, పోటాపోటీగా సేవలు చేసేందుకు రాజకీయపార్టీలు సైతం ముందుకు వచ్చాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు సేవచేయడానికి ముందుకు వచ్చిన యువత, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయపార్టీల హడావుడి చూస్తుంటే సానుభూతి కంటే కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం జలధారతోనే ప్రారంభమైందని విశ్లేషకులు భావిస్తున్నా రు.

సరిగ్గా 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ స్థాయిలో హైదరాబాద్‌ పరిసరాల్లో వర్షం కురవడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ తెలియచేసింది.

హుస్సేన్‌సాగర్‌నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది.

హైదరాబాద్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు హైదరాబాద్‌ లోని పలు లోతట్టుప్రాంతాలు జలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది.

నగరం లోని ఖైరతాబాద్‌, టోలీ చౌకీ, బోరబండ, సికింద్రాబాద్‌, అంబర్‌ పేట, ఎల్బీనగర్‌, వనస్థలి పురం, హయత్నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరుకుంది.

ముందుజాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాను నిలిపి వేశారు.

ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వాహనాలు ఎక్కడవి అక్కడే ఆగిపోయి,కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వర్షపు నీటి ఉధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగింది.

దీంతోట్రాఫిక్‌ పోలీసులు, నేషనల్‌ హైవే ఆథారిటీ అధికారులు, సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి పునరుద్ధరించారు.

మరోవైపు నగరంలోని ప్రధాన జలాశయాలకు భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది.లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తక్షణమే తరలించి వారికి ఆహారం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

  • డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/