వికాస్‌ దూబేపై తల్లి కీలక వ్యాఖ్యలు

నా కొడుకును కాల్చి చంపండి..వికాస్‌ దూబే తల్లి

Kill my son in encounter for police deaths, says gangster Vikas Dubey’s mother

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్ లో డీఎస్పీతో స‌హా 8 మంది పోలీసుల‌ను వికాస్ దూబే గ్యాంగ్ కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. అయితే ఈఘటనపై దూబే త‌ల్లి స‌ర్లా దేవీ స్పందించారు. దూబే త‌క్ష‌ణ‌మే పోలీసుల ఎదుట లొంగిపోవాల‌న్నారు. అత‌ను చేసింది చాలా త‌ప్పు.. అందుకే దూబేను ప‌ట్టుకుని ఎన్ కౌంట‌ర్ చేయ‌మ‌ని పోలీసుల‌ను కోరుతున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. క‌ఠిన‌మైన శిక్ష విధించాల‌ని డిమాండ్ చేశారు. అమాయ‌క పోలీసుల‌ను చంప‌డం వ‌ల్ల దూబేకు ఏం వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. టీవీలో ఎన్ కౌంట‌ర్ వార్త చూసి చాలా బాధ‌ప‌డ్డాను అని దేవి తెలిపారు. రాజ‌కీయ నాయ‌కుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డిన త‌ర్వాతే.. దూబే నేరాల‌కు పాల్ప‌డ‌టం మొద‌లు పెట్టార‌ని ఆమె చెప్పారు. ఈ నేరాలు త‌మ కుటుంబానికి తీవ్ర ఇబ్బందిని క‌లిగిస్తున్నాయ‌ని స‌ర్లా దేవి ఆవేద‌న చెందారు. నాలుగు నెల‌ల పాటు దూబేతో మాట్లాడ‌లేదు. ల‌క్నోలో నివాస‌ముంటున్న త‌న పెద్ద కుమారుడితో ఉంటున్నాన‌ని స‌ర్లా దేవీ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/