కరోనా సమస్యలకు సరికొత్త పరిష్కారాలు

విద్యా సంవత్పరంలో మార్పులు

Students in Examination Hall (File)

మార్చి చివరలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు కరోనావైరస్‌ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా అర్ధాంతరం గా వాయిదాపడ్డాయి.

ఏ విద్యార్థికైనా, జీవితంలో పదో తరగతి పరీక్షలు ఓ మైలురాయి లాంటిది. లాక్‌డౌన్‌ల నేపధ్యంలో ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయని అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళనలు నెలకొన్నాయి.

దీనికి కారణం సామాజిక మాధ్యమాల్లో పదోతరగతి పరీక్షల గురించి నకిలీ సమాచారం పెద్ద ఎత్తున చలామణీ కావడం కారణం.

ఒక పక్క ప్రభుత్వ అధికారులు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చి తర్వాత ఏ జులై చివరలోనో నిర్వహిస్తామని పదేపదే చెప్తున్నా ఈ ఆందోళన తగ్గేట్లు మాత్రం కనపడట్లేదు.

ఎందుకంటే జనం నిజాల్ని కన్నా అబద్దాల్ని నమ్మటానికి అలవాటుపడిపోయారు. రెండు తెలుగురాష్ట్రాల్లో పదిలక్షలపైచిలుకు విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కరోనా నేపధ్యంలో ప్రభుత్వ అధికారులకు సవాలుతో కూడుకున్నదే.

సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య 2 మీటర్ల దూరం వ్ఞండేటట్లు పరీక్ష గదుల ఏర్పాట్లు చేసి, గదికి కేవలం 12మంది మాత్రమే పరీక్షలు రాసేవిధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామంటున్నారు.

దీనివల్ల పరీక్షాకేంద్రాలను కూడా భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కోరాష్ట్రంలో 30,000 వేల పరీక్షాకేంద్రాలు అవసరం ఉంటుందని అంచనా.

పరీక్షలు నిర్వహించటానికి సగటున ఒక కేంద్రంలో 20 మంది ఇన్విజిలేటర్లను వేసుకున్నా, 6లక్షల మందికి ఇన్విజిలేటర్లు అవసరం అవ్ఞతారు. ఇవన్నీ ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి కాబట్టి, వీటి నిర్వహణ పెద్ద కష్టం కాకపోదు.

కాని కొన్ని అంశాలు మాత్రం,ప్రభుత్వాల చేతుల్లో వ్ఞండవ్ఞ. వాటి గురించి పూర్తిగా చర్చించాల్సిన అవసరం వ్ఞంది. మొట్టమొదటి ప్రజారవాణా విద్యార్థులను వివిధ సెంటర్లకు తీసుకెళ్లటానికి అవసరమైన రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి వ్ఞంటుంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతల్లో సామాజిక దూరం పాటిస్తూ ఆర్టీసీ బస్లుసు నడపటం సాధ్యమేమో కాని, పట్టణం ప్రాంతాల్లో ఎంతవరకు సాధ్యమౌతుంది అనేది సందేహమే?

రెండోది పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవటం వల్ల ప్రతి కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు చేరే ప్రమాదం వ్ఞంది. దీనికల్లా కారణం మన పరీక్షలో ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశానికి వీలు లేకపోవటమే నని వేరే చెప్పనక్కర్లేదు.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వమే బస్సులను ఏర్పాటు చేసి, సామాజిక దూరం పాటించేలా కండక్టర్లకు బాధ్యతను అప్పగించాలి. బస్సులో ఎక్కేటప్పుడే ఇన్ఫ్రరెడీ ధర్మామీటర్ల సహయంతో విద్యార్థులకేమన్నా జ్వరలక్షణాలున్నాయేమో చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

రోడ్డువారగా వ్ఞన్న పాఠశాలల్లో పరీక్షాకేంద్రాలు నడపకుండా, బస్సులు నిలపటానికి అవసరమైన పెద్ద ఆవరణ వ్ఞన్న పాఠశాలల్లో కేంద్రాలే కేటాయించటం వల్ల, నేరుగా బస్సుల నుండి తరగతి గదిలోకే తీసుకెళ్లటం వీలవ్ఞతుంది.

పాఠశాలల బయట గుంపులు, గుంపులుగా మూగే ప్రమాదాన్ని నివారించవచ్చు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఇదే తరహాలో బస్సులను ఏర్పాటు చేసుకోవాలి.

విద్యార్థి ఏ పాఠశాలలో చదువ్ఞతున్నాడో అక్కడే బస్సులు ఎక్కేవిధంగా, తిరిగి మళ్లీ అక్కడే దిగే విధంగా ఏర్పాటు చేసినట్లైతే చాలావరకు సామాజికదూరాన్ని పాటించటం సాధ్యమౌతుంది.

అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిగా మాస్కులు ధరించేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యులు లేదా పరీక్షకేంద్రాల అధికారులపై వ్ఞంది. వీలైనంతవరకు విద్యార్థి చదువ్ఞతున్న పాఠశాల దగ్గరలోనే పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేస్తే, ఈ కార్యనిర్వహణ కొంత సులువ్ఞ అవ్ఞతుంది.

ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒకచోట పొరపాటు జరిగితే మాత్రం చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరే అవ్ఞతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా, ప్రజల్లో బదనాం చేద్దామని ప్రతిపక్షాలు కాచుకూర్చున్నాయి.

గోతిక్కా నక్కలా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ప్రజల శ్రేయస్సుకోరి ప్రభుత్వంతో కలిసి, ప్రతిపక్షాలు పనిచేస్తాయి. కాని మన తెలుగు రాష్ట్రాల దరిద్రమేమిటంటే, అయినదానికి కానిదానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూడటం.

కరోనా చావ్ఞల దగ్గర్నుంచి, విశాఖ మరణాల వరకూ ప్రభుత్వాన్ని తద్వారా ముఖ్యమంత్రిని ప్రజల ముందు పలచన చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతిస్తుం టాయి.

ఇటువంటి పరిస్థితులో ఏ చిన్నపొరపాటు జరిగినా ‘చిన్నపిల్లల జీవితాలతో చెలగాటాలాడుతున్న ప్రభుత్వం అని మళ్లీ దుమ్మెత్తిపోసే అవకాశం లేకపోలేదు. బాలల బంగారు భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది.

అందుకు తగిన చర్యలు తప్పక తీసుకోవాలి. ఇక అంతకం తకూ దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే వ్ఞన్నాయి.

జూన్‌, జులైలో దీని ప్రభావం మరింత ఎక్కువగా వ్ఞండబోతోందని, ఎయిమ్స్‌, ఢిల్లీవైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో, తల్లిదండ్రులు, విద్యార్థులే మరింతగా ఆందోళనలు పెరుగుతు న్నాయి.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులు చేస్తే బాగుంటుందని ఎక్కువమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా తల్లిదం డ్రులు, విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి వ్ఞంది.

పదోతరగతిలో వచ్చే మార్కుల వల్ల ముందుముందు అంతగా ఉపయోగం ఏమి వ్ఞండదు. భవిష్యత్తులో ఉద్యోగావకాశాలుకాని, కెరీర్‌ని ఎంచుకునే విషయంలో కాని ఈ మార్కుల ప్రాధాన్యత కొంతవరకేనన్న నిజాన్ని గ్రహించాలి.

ఒకప్పుడు పదోతరగతి అంటే (స్కూల్‌ ఫైనల్‌) చాలా గొప్పగా చూసేవాళ్లు. పదోతరగతిలోనే మంచి ఉద్యోగాలు లభించేవి. కాని ఈ రోజుల్లో కేవలం ఇంటర్‌లోకి ప్రవేశానికి మాత్రమే ఆ మార్కులు ఉపయోగపడతాయి.

కాబట్టి వారి సంవత్సర సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రేడులు కేటాయించడం ఒక మార్గం లేదా 8,9 తరగతులలోని మార్కులు, పదోతరగతిలోని అంతర్గత మార్కుల ఆధారంగా వారికి గ్రేడ్లు కేటాయించడం ఇంకో మార్గం.

ఇవేవి కుదరనప్పుడు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రతి సబ్జెక్టులో పరీక్ష నిర్వహించటం మరోమార్గం. ప్రతిదానికి మంచి చెడులు రెండూ వ్ఞంటాయి.

  • ఈదర శ్రీనివాసరెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/