ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

సకాలంలో చెల్లింపులేవి?:- ఆర్కే, ముస్తాబాద, గన్నవరం,కృష్ణాజిల్లా

రైతులకు తమ పంటలకు మద్దతు ధర వచ్చేలా చూడాలని అందుకు అధికారులదే బాధ్యత అని ముఖ్యమంత్రి ఉపదేశిం చారు. అయితే రాష్ట్రంలో రైతులు తమ పంటల అమ్మకాలలో అడుగడుగునా నష్టపోతూనే ఉన్నారు. అంతకుమించి కొను గోలు చేసినా, చెల్లింపులతో అనవసర తాత్సారంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఉదాహరణకు గత డిసెంబరు మాసంలో అమ్మిన ధాన్యానికి రైతులకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో రైతులు బ్యాంకుల, మిల్లర్ల చుట్టూ తిరగడంతోనే సరిపోతున్నది. ఇలా అనవసర జాప్యంతో తెచ్చిన రుణాలకు వడ్డీ భారం పెరిగిపోతున్నది. ఆపైనా తేమ అని, రవాణా ఖర్చులు అని, నాణ్యత పేరుతో ధరలను తెగ్గో స్తున్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులదే బాధ్యత అని చేతు లు దులుపుకోవడం సబబుకాదు. అలాగే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో రాజకీయ పెత్తనంతో రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండాపోయింది.

నిందితులకు శిక్షలో జాప్యమెందుకు?:-ఎన్‌.అంజనేయులు, హన్మకొండ

అనేకమంది నేరస్తులు శిక్షలు తప్పించుకొని సమాజంలో కాలర్లు ఎగరవేసుకుంటూ దర్జాగా తిరుగాడుతుంటే సామా న్యులు మన చట్టాలను అర్థం చేసుకోలేక తికమకపడిపోతు న్నారు. అభద్రతాభావంతో అల్లాడిపోతున్నారు. అతిక్రూరమైన నేరాలకుగాను నేరస్తులకు విధించబడ్డ శిక్షలు సైతం అమలు కావడంలో జరుగుతున్న జాప్యానికివారిలో ఆగ్రహం పొంగుకొ స్తోంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశాన్ని కుదిపేసిన అతి భయంకరమైన నిర్భయకేసులో సర్వోన్నత న్యాయస్థానం నలుగురు నేరస్తులకు ఉరిశిక్షలు విధిస్తే అవి ఇప్పటివరకు అమలు కాకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఉపాధ్యాయుల పనితీరుపై నిఘా: -కె.టి.గిరిధర్‌, విశాఖపట్నం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్ర మంగా పాఠశాలకు హాజరై, సమయానుసారం సిలబస్‌ పూర్తి చేసి, పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్నారో, లేదో పర్యవేక్షించాల్సిన విద్యాశాఖాధికారులు జిల్లా కేంద్రాలకే పరిమితమవ్ఞతున్నారు. పర్యవేక్షణ లోపించడంతో ప్రాథ మిక విద్య గాడి తప్పే పరిస్థితి నెలకొంది. వారానికోసారి ప్రతి పాఠశాలను తప్పక పర్యవేక్షించాలి.

నాణ్యమైన పాఠ్యపుస్తకాలను అందించాలి: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

రాష్ట్రంలో విద్యార్థుల సిలబస్‌ వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారబోతోంది.తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టబోతున్న దృష్ట్యాపాఠాలను మార్చే క్రమంతో పాఠ్యపుస్తకాలను మార్చబోతున్నారు. ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఒకేసారి ఇప్పుడున్న సిలబస్‌ రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంలో కొత్త పాఠాలను ముద్రించబోతున్నారు. ప్రస్తుత పాఠ్యపుస్తకాలు తక్కువనాణ్యతకలిగి త్వరగా చిరిగిపోవ డానికి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యాసంవత్సరం చివరిలో వారిపుస్తకాలలో చివరిన ఉన్న పాఠాల కాగితాలు చాలా మంది విద్యార్థులు చేతుల్లో చిరిగిపోయి పాఠాలు అర్థంకాక ఇచ్చిన ఇంటిపని చేయడానికి వీలులేక సతమతమవ్ఞతున్నారు. చిన్న పిల్లలచేతుల్లో ఉండే పుస్తకాలు సంవత్సరకాలం పాటు మన్నిక కలిగేలా మందపాటిఅట్టతో,మందపాటికాగితాలతో, నాణ్యమైన ముద్రణతో, నాణ్యమైన రంగులతో తయారు చేయాలి.

పథకాలపై పర్యవేక్షణ అవసరం:-కె.రామకృష్ణ, నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ఏటా పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా సత్ఫలితాలను ఇవ్వడం లేదన్నది నిర్వివాదాంశం.అధికారులనిర్లక్ష్యం,అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం,పర్యవేక్షణాలోపంకారణంగా ఎన్నో పథకాలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి.గతంలో సంక్షేమపథకాలను ప్రక టించడంతోనే ప్రభుత్వాల బాధµ్యతతీరిపోదని,సరైన పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం మార్గదర్శకత్వం వెలువరించినా దానిని పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులు, పాలకులు లోపాలను సవరిస్తేనే సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం గతంలో నిర్వహించి, అర్థాంతరంగా ఆపేసిన పల్లెవెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలి.

సెల్‌ఫోన్‌ మోజులో యువత: -వి.కమలాదేవి, నల్గొండ

నేటి యువత ఎక్కువ సెల్‌ఫోన్‌మోజులో పడుతున్నారు. ప్రైమరిస్కూల్‌కు వెళ్లే పిల్లవాడు సైతం సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటానికి ఎక్కువగాఇష్టపడుతున్నాడు.సెల్‌ఫోన్‌ వినియో గంవల్ల యువత పెడదారిపడుతున్నారు. ఎక్కడ చూసినా ఫోన్‌ పట్టుకొని చాటింగ్‌లు వీడియోలు పోస్ట్‌ చేయడం, గేమ్స్‌ ఆడుతూ. సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/